👉 సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక..!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.!
J SURENDER KUMAR,
రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతాం..సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పిలుపునిచ్చారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్మపురి నియోజకవర్గస్థాయి సమావేశం స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో జరిగింది.
👉 ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…….
ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అడ్లూరి అన్నారు. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చని పథకాలను సైతం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

👉 గతంలో ఎన్నడులేని విధంగా నియోజకవర్గఅభివృద్ధికి కృషి చేస్తున్నమని మంత్రి తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో
సుమారు ₹ 450 కోట్ల అంచనాలతో ధర్మపురిలో పుష్కర ఘాట్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని మంత్రి తెలిపారు.
👉 తొలి విడత టైర్ వన్ ద్వారా ₹ 115 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో ₹ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు ధర్మపురికి డిగ్రీ కాలేజీ మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ధర్మపురి నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని అడ్మిషన్లు పొందాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.

👉 ప్రజా ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి గ్యారెంటీలను అమలుచేసి తీరుతామని మంత్రి తెలిపారు.
👉 నియోజకవర్గంలోని రైతులు పండించిన దాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మక్కజొన్న రైతులకు మద్దతు ధర చెల్లించడానికి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన్నట్లు మంత్రి తెలిపారు.
👉 ఈ సందర్భంగా నియోజకవర్గంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి ఈ సందర్భంగా సన్మానించారు.
👉 ధర్మపురి టెంపుల్ మాస్టర్ ప్లాన్ అమలు.. కలెక్టర్ సత్యప్రసాద్ !

ధర్మపురి టెంపుల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయినట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన డ్రాయింగ్స్ పూర్తి కావడంతో త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ధర్మపురి టెంపుల్ సిటీ మాస్టర్ ప్లాన్ పనులను ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.
👉 ఐదేళ్ల లోపు చిన్నారులకు అంగవైకల్యాలు రాకుండా ఇప్పటికే పరీక్షలు నిర్వహించామని జగిత్యాల జిల్లాలో ఆర్బీ ఎస్కే ద్వారా చిన్నారులకు వైద్యం అందిస్తామని అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
ధర్మపురి లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కళాశాలను సద్వినియోగం చేసుకొని అడ్మిషన్లు పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ అన్నారు.

ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలతో చేపట్టిన స్వచ్ఛ గోదావరికి మంచి స్పందన లభిస్తుంది నాగలక్ష్మి తెలిపారు. మంత్రి సలహాలు సూచనలతో ముందుకు సాగుతూ ధర్మపురి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని నాగలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
