J.SURENDER KUMAR,
వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంగళవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

👉 గొల్లపల్లి మండల ఉప సర్పంచ్ గురుజల బుచ్చిరెడ్డి నానమ్మ గురుజల వెంకటమ్మ ఇటీవల మృతి చెందింది విషయం తెలుసుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

👉 జగిత్యాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంచాల రామేశం మరణించిన విషయం తెలుసుకుని మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రామేశం సేవలను గుర్తు చేస్తూ ఆయన మరణం ఆధ్యాత్మిక రంగానికి మరియు సమాజానికి తీరని లోటని మంత్రి అన్నారు.

👉 వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన కట్టేం తిరుపతి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. మంత్రి లక్ష్మణ్ కుమార్, వారి కుటుంబ సభ్యులను పరమర్శించి ప్రభుత్వం మరియు పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
.
