అధికారంలోకి రావడానికి  బీజేపీ కుట్రలు చేస్తుంది !

👉 బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి
ఓట్లను కాపాడే బాధ్యత మీదే !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా నుండి ఓట్లు తొలగించి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తుందని ఈ కుట్రను భగ్నం చేయాల్సిన బాధ్యత బూత్ లెవల్ పోలింగ్ ఏజెంట్లపై ఉందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై ధర్మపురి నియోజకవర్గ బూతు లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమం సోమవారం ధర్మపురి లోని ఎస్ హెచ్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని అన్నారు. ఇందులో భాగంగా ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడమే ఎందుకు ఉదాహరణ అని మంత్రి అన్నారు.

👉 బీజేపీ చేపట్టిన ఓట్ల తొలగింపు కుట్రను అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ  ఆధ్వర్యంలో బూత్ స్థాయిలో పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి ఓట్లు కాపాడాలని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని 269 పోలింగ్ బూతుల పరిధిలో 2.37లక్షల ఓటర్లు ఉన్నట్లు మంత్రి వివరించారు.

👉 రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలంటే బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఈనెల ఓటర్ల వద్దకు వచ్చే బూత్ లెవెల్ పోలింగ్ అధికారులకు అన్ని రకాల సమాచారం అందజేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.

👉 ఇంటింటికి తిరిగి ఓటు హక్కును కాపాడాలి
ఏఐసిసి జనరల్ సెక్రెటరీ రుద్ర సంతోష్ !

ధర్మపురి నియోజకవర్గంలోని బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ప్రతి ఓటును కాపాడి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కును అందరు ఉపయోగించుకునే విధంగా కృషి చేయాలని ఏఐసిసి జనరల్ సెక్రెటరీ రుద్ర సంతోష్ అన్నారు.

👉 ధర్మపురి నియోజకవర్గంలో 2.37 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇందులో 43 వేల ఓట్లు ఓట్లుగా ఉన్నాయని 47 వేల ఓట్లు అనుమాలిస్ ఓట్లుగా ఉన్నాయని సంతోష్ తెలిపారు.

👉 నియోజకవర్గంలో దాదాపు 90వేల ఓట్లు ప్రమాదంలో ఉన్నాయని ఈ ఓట్లను కాపాడాల్సిన బాధ్యత బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్ పై ఉందని అన్నారు.

👉 ఈనెల 26వ తేదీ నుండి వచ్చేనెల 25వ తేదీ వరకు ప్రతి ఇంటికి బూతు లెవెల్ పోలింగ్ ఆఫీసర్ వస్తారని ఓటర్ కు సంబంధించిన అన్ని రకాల పత్రాలను అందజేయాల్సిన బాధ్యతను బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి తో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచులు మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.