వైద్యులు మానవత్వానికి ప్రతీక -పేదల పాలిట దేవుళ్లు !


👉 కాకతీయ మెడికల్ కాలేజ్  అలుమ్నీ గెట్ టుగెదర్‌లో..

👉  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

వైద్యులు సమాజంలో ప్రత్యక్ష దేవుళ్లుగా, ప్రాణదాతలుగా సేవలందిస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో నిర్వహించిన కాకతీయ మెడికల్ కాలేజ్ (KMC) అలుమ్నీ వెల్ఫేర్ అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


కాకతీయ మెడికల్ కాలేజ్ అలుమ్నీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది వైద్యులు, ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..

వైద్య వృత్తి కేవలం ఉపాధి సాధనం మాత్రమే కాదని, అది మానవత్వానికి ప్రతీక అని అన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మానవీయ దృక్పథంతో వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

పేద ప్రజల బాధలను అర్థం చేసుకుని సేవాభావంతో ముందుకు సాగితే వారి పాలిట వైద్యులు దేవుళ్లుగా నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకోవడం అభినందనీయమని, ఇటువంటి గెట్ టుగెదర్ కార్యక్రమాలు వైద్యుల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు సమాజ సేవకు కొత్త స్ఫూర్తిని అందిస్తాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖ వైద్యులను నిర్వాహకులు సన్మానించారు.

గౌరవ అతిథులుగా డాక్టర్ భాస్కర్ రావు బొల్లినేని, ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్కి మ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, Dr. K. సత్యనారాయణ, ఎమ్మెల్యే మాన్‌కొండూరు, డాక్టర్ ఎ.ఎస్. సురేందర్ రావు, గోరుకంటి  చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ కె. రమేష్ రెడ్డి వైస్ ఛాన్సలర్, డా. దీన్ దయాళ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్డా క్టర్ మోహన్ దాస్ డీన్ ప్రిన్సిపాల్ KMC తదితర ప్రముఖులు పాల్గొన్నారు, కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.