ధర్మపురి క్షేత్రంలో త్వరలో ఆర్టీసీ బస్సు డిపో !

👉 కరీంనగర్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం !

👉 ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J. SURENDER KUMAR,

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన ధర్మపురి పుణ్యక్షేత్రానికి యాత్రికుల, ప్రజల, సౌకర్యార్థం త్వరలో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయనున్నామని,  కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక ఆర్టిసి బస్సు సౌకర్యం తో  పాటు ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అదనంగా రెండు నూతన ప్లాట్ ఫామ్ ల  నిర్మాణం చేపట్టడంతో పాటు  అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఆదివారం ఆర్టిసి కరీంనగర్ ఈడీ సోలామన్ కరీంనగర్ ఆర్ ఎం రాజు, జగిత్యాల డిపో మేనేజర్ తో కలిసి ధర్మపురి బస్టాండ్ మంత్రి పరిశీలించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే నియోజకవర్గానికి ఐటిఐ తో పాటు, డిగ్రీ కళాశాల మంజూరు చేయించామని  ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  నిధులు ఇవ్వడానికి అంగీకరించారని అన్నారు.

👉 ధర్మపురి నుండి నిత్యం 4 వేల నుంచి 5 వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రత్యేక నిధులతో బస్టాండ్ లో రెండు కొత్త ప్లాట్ ఫాంలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.

👉 రానున్న రోజుల్లో భక్తుల సౌకర్యాల కొరకు తాగునీటి తో పాటు శానిటేషన్ పనులు చేయిస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురి నుండి వివిధ గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా కొత్తగా 13 రూట్లలో బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

👉 కరీంనగర్ నుండి రాత్రి 8 గంటలకు ప్రత్యేక బస్సు ధర్మపురి వరకు వస్తుందని ఇది చాలామంది ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు ధర్మపురి నుండి ప్రత్యేక బస్సు కరీంనగర్ కు నడిపిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ధర్మపురి నియోజకవర్గంలో ప్రయాణికులు బస్సుల కొరకు వేచి చూడకుండా ఆర్టీసీ సేవలు అందజేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు..