👉 రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ట్రై క్యాప్ చైర్మన్ బెల్ల నాయక్ !
J. SURENDER KUMAR,
గురుకులాలలో విద్యానభ్యసించే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా డ్రెస్సులు బూట్లు తదితర టెండర్లు నిర్వహిస్తే బీఆర్ఎస్ నాయకులు పని పట్టుకొని జరిగిందని ఆరోపించడం అలవాటుగా మారిందని, దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో విచారణకు రావాలని బీఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, ట్రై క్యాప్ చైర్మన్ బెల్ల నాయక్ బహిరంగ సవాల్ చేశారు.
👉 హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియా సమావేశం లో మాట్లాడారు..
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక, ఆయనపై కొంతమంది కావాలనే కుట్రలు పన్నుతున్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగడం సరైన పద్ధతి కాదు అని అన్నారు.
👉 ఈ కుట్రల వెనుక ఉన్న నాయకులకు నేరుగా సవాల్ విసురుతున్నాము. మీకు నిజంగా దమ్ముంటే, మీ దగ్గర నిజాలు ఉంటే… వెనక ఉండి గోతులు తవ్వడం మానేసి, నేరుగా వచ్చి చర్చకు కూర్చోండి. అని అన్నారు.
👉 మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంట మేమంతా ఉన్నాం. దళితుల, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడే నాయకులపై ఇలాంటి పగ ప్రతీకార రాజకీయాలు సాగనివ్వబోం. అంటూ హెచ్చరించారు.
👉 ఇప్పటికైనా BRS నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలి. లేదంటే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
