సీఎం ను కలసిన రిజర్వేషన్లు బస్సు యాత్ర బృందం !


J. SURENDER KUMAR,


తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించబోయే స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి బస్సు యాత్ర చేపడుతున్న ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బుధవారం కలిసింది.

👉 ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర ఉద్దేశాన్ని ఆ నేతలు ముఖ్యమంత్రి కి వివరించారు.


👉 మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభ సభ్యుడు బలరామ్ నాయక్ , ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , ఎమ్మెల్యే బాలు నాయక్ , మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ తో పాటు ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిశారు.