J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ ఆదాయం
₹ 73,82,239/-(డెబ్బయి మూడు లక్షల ఏనబై రెండు వేల రెండు వందల ముప్పది తొమ్మిది ) మిశ్రమ బంగారము 38 గ్రాములు, మిశ్రమ వెండి 4 కిలోల 500 గ్రాములు మరియు విదేశి నొట్లు 22 వచ్చినట్టు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
ఆలయ ప్రాంగణంలో భారీ బందోబస్తు మధ్య దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది.2026 మార్చి 10 నుండి జూన్ 23వరకు ( 105) రోజులకు సంబంధించిన ఆదాయం అని ఈవో తెలిపారు.

హుండీ లెక్కింపులో నాయిని సుప్రియ, సహాయ కమీషనర్, కరీంనగర్ దేవాదాయశాఖ, ఉప ప్రధాన అర్చకులు నేరళ్ళ శ్రీనివాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ ఎ.శ్రీనివాస్, మాజీ దేవస్థాన ధర్మకర్తలు గునిశెట్టి రవీందర్ మరియు తిరుమల సేవా గ్రూప్ ఇంచార్జ్ రవీందర్ & సభ్యులు, కరీంనగర్, శ్రీవల్లి గ్రూప్, పెద్దపల్లి, మమతరెడ్డి గ్రూప్, కరీంనగర్ మరియు ధర్మపురి, లక్షేటిపేట సేవకులు, ఇతరులు, తెలంగాణ గ్రామీన బ్యాంక్, మేనేజర్ & సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు దేవస్థాన అర్చకులు & సిబ్బంది, భక్తులు పాల్గోన్నారు.
