ఎఫ్ సి డి ఎ భవనం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

👉 ఫ్యూచర్ సిటీకి పోర్టల్‌ ఆవిష్కరణ !

J.SURENDER KUMAR,


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ డెవల్మెంట్ అథారిటీ (FCDA ) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. ఇదే సందర్భంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోర్టల్‌ను ఆవిష్కరించారు.


👉 ముఖ్యమంత్రి తో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


👉 మంత్రులు, అధికారులతో కలిసి అథారిటీ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయంలోని త‌న ఛాంబ‌ర్‌లో ఫ్యూచ‌ర్ సిటీ ప‌రిధిలోని ప్రాంతాల‌కు సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించ‌డానికి ఎంపికైన క‌న్స‌ల్టెంట్ సంస్థ ప్ర‌తినిధుల‌కు లెట‌ర్ ఆఫ్ అవార్డును అందించారు. తర్వాత ఫ్యూచర్ సిటీ పరిధిలోకి కొన్ని గ్రామాలను చేర్చుతూ సభా వేదికపై ముఖ్యమంత్రి  సంతకం చేశారు.