పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ లో  అనుకూల వాతావ‌ర‌ణం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR

అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కె చందన , సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) భరత్ డాకా ఢిల్లీలో ముఖ్యమంత్రి ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.

👉 భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1 ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.

👉 సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వం–ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది.

👉 ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి  అభినందించారు. వారు సాధించిన విజ‌యం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుంద‌ని ప్రశంసించారు.