ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే గొప్ప నగరంగా రాణిస్తుంది !

👉నెట్ జీరో సిటీగా కాలుష్యరహిత నగరంగా  !

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,


ఫ్యూచర్ సిటీ దేశానికే కాదు. ప్రపంచానికీ ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.


ఈ నగరం భవిష్యత్‌కు ఒక దిక్సూచి. కచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. లేక్స్ అండ్ రాక్స్ సిటీగా, ముత్యాల నగరంగా హైదరాబాద్ నగరం ఎలా పేరుగాంచిందో భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా కాలుష్యరహిత నగరంగా ప్రపంచంలోనే గొప్పగా రాణిస్తుంది. ఆ విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


👉 ఆయా గ్రామాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మరికొన్ని గ్రామాలను చేర్చుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. తీర్మానాలు చేసిన మిగతా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపే విషయాన్ని గ్రామాల వారిగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


👉 ముఖ్యమంత్రి తో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


👉 ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కలపాలని కొన్ని గ్రామాలు తీర్మానాలు చేశారు. మరికొన్ని ప్రతిపాదనలు అందాయి. సూచనప్రాయంగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపాం. మిగతా గ్రామాలకు సంబంధించి ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో గ్రామాల వారీగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని ముఖ్యమంత్రి చెప్పారు.


👉 ఫ్యూచర్ సిటీ దేశానికే కాదు. ప్రపంచానికీ ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఈ నగరం భవిష్యత్‌కు ఒక దిక్సూచి. కచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. లేక్స్ అండ్ రాక్స్ సిటీగా, ముత్యాల నగరంగా హైదరాబాద్ నగరం ఎలా పేరుగాంచిందో భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా కాలుష్యరహిత నగరంగా ప్రపంచంలోనే గొప్పగా రాణిస్తుంది. ఆ విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేశారు.


👉 వీలైనప్పుడల్లా ఫ్యూచర్ సిటీ కార్యాలయానికి వస్తాను. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రి శ్రీధర్ బాబు  వారానికోసారి ఇక్కడికి వచ్చి స్థానికుల సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తారని చెప్పారు.


👉 ఫ్యూచర్ సిటీ మన పిల్లలకు మాత్రమే కాదు. మన పిల్లలు, వారి పిల్లలు, భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్‌ను అందించడమే కాదు. ప్రపంచానికి గొప్ప దిక్సూచిగా అందించాలని ప్రభుత్వం గొప్ప సంకల్పం తీసుకున్నది. గత డిసెంబర్‌లో పనులు ప్రారంభించుకుని సరిగ్గా 150 రోజుల్లో ఈ రోజు (జూన్ 10న) కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశాం. ఇది మా పనితనం. మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక అని ముఖ్యమంత్రి అన్నారు.


👉 తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి భారత్ సిటీయే వేదిక కావాలి. 2034 నాటికి టోక్యో, న్యూయార్క్, సింగపూర్ నగరాలతో పోటీ పడే నగరంగా, రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చా అని పేర్కొన్నారు.


👉 2026 జూన్ 10వ తేదీ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఏఐ, డేటా సెంటర్స్, జీసీసీ సెంటర్స్, గ్లోబల్ ఫార్చూన్ 500 కంపెనీలను ఇక్కడికి రప్పించేందుకు ఈరోజు పునాది పడింది అని అన్నారు.


👉 గతేడాది గ్లోబల్ సమ్మిట్‌ను ఇక్కడే నిర్వహించాం. వచ్చే డిసెంబర్‌లో మళ్లీ ఇక్కడే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తాం. ప్రపంచ దేశాలను రప్పించి వారి నుంచి పెట్టుబడులను ఆకర్షించి తద్వారా లక్షలాది మంది మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని పేర్కొన్నారు.


👉 నిన్నమొన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ ఎక్కడికక్కడ స్థంభించిపోయాయి. రోడ్ల మీద వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి కారణం ఎవరు. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణలకు గురికావడంతో నీళ్లన్నీ రోడ్లమీదకు వస్తున్నాయి. అందుకే నిర్ధాక్షిణ్యంగా అక్రమ కట్టడాలను తొలగిస్తూ పునరుద్ధరిస్తున్నాం అని సీఎం అన్నారు.