మెట్రో విస్త‌ర‌ణ‌ అంశాల‌పై క‌న్స‌ల్టెంట్‌ !

👉 కేంద్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ఏకాభిప్రాయం !


J.SURENDER KUMAR,


హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్య‌యం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి  సమావేశంలో ఏకాభిప్రాయానికి వ‌చ్చారు.


👉 హైద‌రాబాద్ మెట్రో రైలు స్వాధీనం.. ఫేజ్-2 విస్త‌ర‌ణ‌పై కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి  జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి.
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, ఫేజ్‌-2 విస్త‌ర‌ణ‌పై ఉన్న ఆటంకాల‌ను తొల‌గించేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కేంద్ర మంత్రుల‌తో వ‌రుస‌గా రెండు రోజులపాటు చర్చలు విజయవంతమయ్యాయి.


👉 మొదట సోమ‌వారం రాత్రి రైల్వే శాఖ మంత్రి  అశ్వినీ వైష్ణ‌వ్‌ , కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి  కిష‌న్ రెడ్డితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈరోజు ఉదయం కేంద్ర గృహ నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ తో, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణ‌వ్ , కిష‌న్ రెడ్డి , ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఖ‌ట్ట‌ర్ నివాసంలో ఈ అంశంపై చ‌ర్చించారు.


👉  ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌- I వాల్యూయేష‌న్‌, స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌, నిర్మాణ‌ వ్య‌యం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ తదితర అంశాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు క‌న్స‌ల్టెంట్‌ను నియ‌మించాల‌ని కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రి  సమావేశంలో ఏకాభిప్రాయానికి వ‌చ్చారు.


👉  క‌న్స‌ల్టెంట్‌గా SBICAPS ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్‌-I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌-II విస్త‌ర‌ణ‌తో పాటు ఇత‌ర అంశాల‌పై SBICAPS స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయ‌నుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు.


👉  క‌న్స‌ల్టెంట్ అధ్య‌య‌నం స‌మ‌యంలో స‌మ‌న్వ‌యానికి ప్ర‌తినిధులుగా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి (MA&UD) శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ఉండాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. ఈ అధికారులు ఇద్ద‌రు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఈ ప్ర‌క్రియ వేగంగా ముందుకు సాగేందుకు కృషి చేస్తారు.