👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి పలు జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
👉 ₹ 50.73 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం నిర్వహించారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్ తో కలిసి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా వర్చువల్‌గా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ₹ 36.65 కోట్లతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ₹ . 14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియాల్లో బాల బాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను ప్రారంభించారు.
👉 శంకుస్థాపనలు చేసిన పనుల వివరాలు !

@ ₹ 10 కోట్లతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం.!
@ ₹ 10 కోట్లతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ.!
@ ₹ 4 కోట్లతో నారాయణపేట్ జిల్లా నర్వ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం !
@ ₹ 4 కోట్లతో వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో మల్టీపర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖో- ఖో కోర్టుల నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి.!
@ ₹ 3.50 కోట్లతో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం.!
@ ₹ 2.65 కోట్లతో మెదక్జి ల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణ!
@ ₹ 2.50 కోట్లతో నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో వాలీబాల్ & కబడ్డీ కోర్టుల నిర్మాణం.!
👉 ప్రారంభోత్సవాల వివరాలు:
@ ₹ 5.70 కోట్లతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన FIFA AIFF తెలంగాణ టాలెంట్ అకాడమీ!
@ ₹ 35.95 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ !
@ ₹ 44.50 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ !
@ ₹ 58.50 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ అకాడమీ !
@ ₹ 49 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హ్యాండ్‌బాల్ అకాడమీ !
