J.SURENDER KUMAR,
మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వాటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా విద్యార్థినీ విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ , సలహాదారు కె. కేశవరావు తో పాటు ప్రజాప్రతినిధుల సమక్షంలో శుక్రవారం ఎల్ బీ స్టేడియం వేదికగా గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

👉 “నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్గర్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేశారు.
