👉 పీవీ 105వ జయంతి సందర్భంగా ఘన నివాళులు !
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
మాజీ ప్రధానమంత్రి, ‘భారతరత్న’ స్వర్గీయ పీవీ నరసింహారావు చరిత్ర పురుషుడని, చేసిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ దశ దిశను మార్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి తో పాటు పీవీ కి నివాళులు అర్పించినవారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు.
👉 దేశానికి మాజీ ప్రధాని పి.వి చేసిన సేవలు చిరస్మరణీయం!
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన దూరదృష్టి కలిగిన నాయకుడు పీవీ నరసింహారావు, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం, దేశ ప్రజలు ఎప్పటికీ మరువలేరని పేర్కొన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానేతగా పీవీ నరసింహారావు చిరస్థాయిగా గుర్తుండిపోతారని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మాజీ ప్రధాని, భారత రాజకీయ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిన మహనీయుడు పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

ఈకార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలతో కలిసి పీవీ నరసింహారావు సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు.
