మెట్రో ఫేజ్‌-2కు అనుమ‌తులు ఇవ్వండి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J. SURENDER KUMAR


హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2కు స‌త్వ‌ర‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి . రేవంత్ రెడ్డి  కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ కు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌తో ముఖ్య‌మంత్రి  స‌మావేశ‌మ‌య్యారు.

👉 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలో 76.4 కిలోమీట‌ర్ల పొడ‌వైన మెట్రో ఫేజ్‌-2 అవ‌స‌రం ఎంతో ఉంద‌ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. మెట్రో ఫేజ్‌-2 సాకార‌మైతే న‌గ‌రంలో రాక‌పోక‌లు వేగంగా సాగ‌డంతో పాటు ర‌హ‌దారుల‌పై ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని.. సుస్థిరాభివృద్ధికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని వివరించారు.


👉 ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ సూచ‌న మేర‌కు అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌లు చేసి ప్రాజెక్టు డీపీఆర్ స‌మ‌ర్పించిన విష‌యాన్ని ముఖ్యమంత్రి  ఈ సందర్భంగా ఖట్టర్ కు గుర్తు చేశారు. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2 ఆవ‌శ్య‌క‌త‌ను దృష్టిలో ఉంచుకొని ఇత‌ర శాఖ‌ల నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ఇప్పించాల‌ని కోరారు.


👉 కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.