పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి !

👉 మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

అభివృద్ధి  పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి,సత్వరం పనులు పూర్తిచేయాలని, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంథని పట్టణంలో ఆదివారం ఉదయం మంత్రి   రావుల చెరువు కట్ట అభివృద్ధి పనుల పురోగతి ఆకస్మిక తనిఖీ  చేశారు.

అభివృద్ధి పనుల విషయంలో స్థానిక ప్రజలు సలహాలు సూచనలు ఇస్తూ సహకరించాలని మంత్రి కోరారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డ్రైనేజీ దారి మంల్లించాలని, వెంటనే పనులు ప్రారంభించాలని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ ను ఆదేశించారు,


మంత్రి వెంట   కౌన్సిలర్లు మారుపాక నీహారిక, జంబోజు శ్రీమతి, ఎ.యం.సి చైర్మన్ కుడుదుల వెంకన్న, టిజి ఆర్ సి సలహాదారు శశిభూషణ్ కాచె, మండల కాంగ్రేస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్ తదితరులు ఉన్నారు.