J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ న్యాయవాదిగా మెట్ట మహేందర్ ను ఆ సంస్థ నియమించింది.

పెండింగ్ కేసులు, న్యాయ వివాదాలు, కోర్టులలో కేసులు, వినియోగదారుల సమస్యలు పర్యవేక్షణ ప్రతినిధిగా జగిత్యాల పట్టణముకు చెందిన ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ పర్యవేక్షిస్తారు.

చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్ రెడ్డి ఈ నెల 4న, ప్రభుత్వ లేఖ సంఖ్య 305 ద్వారా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహేందర్ గతంలో ప్రభుత్వా న్యాయవాదిగా కొనసాగారు.
