J.SURENDER KUMAR,
అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చిన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల విద్యార్థులను రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అభినందించారు.
👉 మే 29నుండి 31వరకు నేపాల్ దేశం కాట్మాండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్స్ షిప్ పోటీలల్లో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రూషగాని వినూత్న అండర్ 9-10 బాలికల స్పారింగ్ విభాగంలో ప్రథమ స్థానం నిలువగా అండర్ 14-15 బాలికల స్పారింగ్ విభాగంలో వి నిహారిక ప్రథమ స్థానంలో నిలవగా దాసరి ధనస్విని 9-10 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు.
👉 ఓదెల గ్రామానికి చెందిన లాగిశెట్టి శరణ్య 16-17 బాలికల స్పారింగ్ విభాగంలో తృతీయ స్థానంలో నిలిచి బ్రౌంజ్ మెడల్ సాధించగా అండర్ 17-18 బాలికల స్పారింగ్ విభాగంలో ఎంబడి చందన తృతీయ స్థానం స్థానం బ్రౌంజ్ సాధించారు. కరాటే మాస్టర్ కాలువల రమేష్ ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కలువగా వీరిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు.
👉 కంప్యూటర్ ఆఫరేటర్లను కొనసాగించాలి..
మంత్రి కి వినతి పత్రం !

రెవెన్యూ శాఖ లో గత 20 సం.ల నుండి పని చేస్తున్న 632 టైపిస్ట్ మరియు కంప్యూటర్ ఆఫరేటర్లను యాధావిధిగా కొనసాగించాలని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి శుక్రవారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు.
టైపిస్ట్ మరియు కంప్యూటర్ ఆఫరేటర్లను డిస్కాంటినేషన్ చేయమని ప్రభుత్వం మెమో జారీ చేసిదాని వారు మంత్రికి వివరించారు. మెమో రద్దు చేసి ఆఫరేటర్లను యాధావిధిగా కొనసాగించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రెవెన్యూ శాఖ మంత్రి తో మాట్లాడి టైపిస్ట్ మరియు కంప్యూటర్ ఆఫరేటర్ సేవలను వినియోగించుకునే విధంగా సహకరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో స్టేట్ యూనియన్ జనరల్ సెక్రటరీ యం. భూమేష్, జగిత్యాల జిల్లా అధ్యక్షకార్యదర్శులు, దేవాల గోపి, రాపర్తి రాజేందర్, నరేష్, మహేందర్ , అర్జున్, వినోద్, సల్మాన్, రాజేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
