ప్రజా ఆరోగ్యం పై శ్రద్ధ వైద్యానికి ప్రాధాన్యం !


👉 ఏఎన్ఎం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకున్న మా ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.  జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రంలో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ……

ప్రజా ప్రభుత్వంలో పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకురావడానికి అనేక చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చోరవతో జగిత్యాల జిల్లాలో సర్కారు వైద్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

👉 ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ నిర్మాణంతో పాటు 450 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

👉 జగిత్యాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రాన్ని మెడికల్ హబ్ గా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

👉 బీర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో పాటు సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

👉 రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అడగకుండా నే ప్రమాద బీమా కల్పించిందని రాష్ట్రంలోని ఏఎన్ఎంలు ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు

👉 మారు మూల మండలమైన బీర్ పూర్ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి తెలిపారు ‌అంతకు ముందు బీర్ పూర్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

👉 ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..

మారుమూల మండలాల అభివృద్ధి కోరకు ప్రత్యేక నిధులు సాధించి మారుమూల మండలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.


జగిత్యాల జిల్లా కేంద్రాన్ని వైద్య సేవలకు నిలయంగా మార్చడానికి చేస్తున్న కృషికి మంత్రి అడ్లూరి తో పాటు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం లభిస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.

👉 ప్రస్తుతం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య సేవలు అందిస్తామని రానున్న రోజుల్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు.

కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఏడాదిలోని బీర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేశామని అన్నారు. పూర్తిస్థాయిలో వైద్య సేవలను బీర్పూర్ లో అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరీష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు.