👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటినుంచి ప్రతి నెలా పనుల పురోగతిని తనిఖీ చేస్తానని చెప్పారు.

👉 ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, మంగళవారం ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియో థెరఫీ – పారా మెడికల్ కాలేజీలు, సంబంధిత హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
👉 నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతీ నెలా పనుల పురోగతిపై తనిఖీ చేయడమే కాకుండా ఒక రోజు సైట్‌లోనే బస చేస్తానని చెప్పారు.

👉 పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిని సస్పెండ్ చేయడానికి వెనుకాడొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.
👉 భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
👉 శ్రీకాంత్ ను అభినందించిన సీఎం !

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ (BWF Super 300 US Open)లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. షట్లర్ శ్రీకాంత్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
