J.SURENDER KUMAR,
హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయం లో బుధవారం ఉదయం 7.00 గం. ల నుండి 10.00 వరకు సామూహిక బ్రాహ్మణ బృందంతో అక్షర లక్ష గాయత్రి జప యజ్ఞం నిర్వహించబడుతుందని తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ, అధ్యక్షులు మరియు జప యజ్ఞ సమన్వయ కర్త వినోద్ కుమార్ మహావాది తెలిపారు.
వారాహి గుప్త నవరాత్రుల లో భాగంగా “సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం ” నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
గత 70 రోజుల నుండి దాసంజనేయ స్వామి దేవాలయం లో బ్రాహ్మణ సహాయంతో 11 లక్షల గాయత్రి జపం పూర్తి అయిందని తెలిపారు.

ఆగష్టు 29 న గాయత్రి పాడ్యమి వరకు కనీసం 20 లక్షల జపం పూర్తి చేయాలనే ఉద్దేశం తో వివిధ దేవాలయాలలో సామూహిక జప యజ్ఞాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఉపనయనం అయిన బ్రాహ్మణులు సమయ త్యాగం చేసి అష్టలక్ష్మి దేవాలయం లో అధిక సంఖ్యలో పాల్గొనాలని
వినోద్ కుమార్ మహావాది. ప్రకటనలో కోరారు వివరాలకు
మొబైల్ నెంబర్ 9000013755 కు సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
