కేటీఆర్ అధికారంలో ఉండగా రైతులు కనబడలేదు !

👉 కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను  పరామర్శించలేదు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

  J.SURENDER KUMAR,

మాజీ మంత్రి కేటీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో రైతులు, రైతుల సమస్యలు కేటీఆర్ కు గుర్తుకు రాలేదని, కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను కనీసం మానవత్వంతోనైనా పరామర్శించలేదని  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో మంగళవారం మంత్రి అడ్లూరి పర్యటించారు.
నంది మేడారం, రచ్చపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ….

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు రైతులను, వారి సమస్యలు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. అధికారం పోగానే కేటీఆర్ రైతుల పరామర్శ పేరిట డ్రామాలు ఆడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

👉 కొండగట్టు బస్సు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను నాడు మాజీ సీఎం  కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని మంత్రి ప్రశ్నించారు.  ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక రాష్ట్ర రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రైతులకు అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత మరిచి ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

👉 నంది మేడారం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో నంది మేడారం గ్రామస్తులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని నాటి మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట ఇచ్చి తప్పారని మంత్రి ఆరోపించారు.  నేను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.