👉 చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి
J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలలో భాగమైన చేయూత పెన్షన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి అన్నారు.
“అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్ అందేలా అవసరమైన సహాయాన్ని అందిస్తాం” అని ఆమె అన్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు, ధర్మపురి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అర్హులైన ప్రజల నుంచి కొత్త పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించేందుకు కొత్త పెన్షన్ సహాయ కేంద్రాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు.
సహాయ కేంద్రం ద్వారా వివిధ వర్గాలకు చెందిన అర్హులైన ప్రజలకు చేయూత పెన్షన్ పథకానికి సంబంధించిన సమాచారం, దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాలు మరియు ఇతర సహాయాన్ని ఈ కేంద్ర ద్వారా అందించనున్నారు.
👉 పెన్షన్ దరఖాస్తు కు వీరే అర్హులు !
వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు !

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ , మున్సిపల్ వైస్ ఛైర్మెన్ ఇందారపు రామన్న , వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
