ప్రజల సహకారం తోనే  పచ్చదనానికి ప్రాణం !

👉 చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి !


J.SURENDER KUMAR,


పచ్చదనం మానవాళి మనుగడకు,  భవిష్యత్ తరాలకు ఆరోగ్య ప్రధాని, పచ్చని చెట్ల పెంచడానికి, పరిరక్షించడానికి ప్రజల సంపూర్ణ సహకారంతోనే విజయవంతం అవుతుందని ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి  అన్నారు.


వనమహోత్సవంలో భాగంగా ధర్మపురి పట్టణంలో మంగళవారం ప్రదర్శన నిర్వహించారు, మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు అధికారులు, చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు.


👉 ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ..

చెట్లు మనిషి జీవనానికి ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.  మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ ఇందారపు రామన్న , కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మేనేజర్ గంగాధర, శానిటరీఇన్స్పెక్టర్ ,  అధికారులు, సిబ్బంది,  ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.