బీర్పూర్ నక్సల్స్ మందు పాతరకు 37 ఏళ్లు !

👉 హోం మంత్రి పర్యటనకు ప్రతీకారము? ప్రయోగమా ?

👉 మందు పాతర విస్ఫోటం వికటించి14 మంది అమాయకులు మృతి..!

👉 మృతులలో గణపతి, బంధువులతో పాటు జనశక్తి నేత చలపతిరావు బంధువులు సైతం..!

👉 నక్సల్స్ ఉద్యమం పై చెరిగిపోని అపకీర్తి మరక !

👉 మందు పాతార మాస్టర్ మైండ్ గణపతి !

J.SURENDER KUMAR,

నక్సల్స్ , పోలీసులకు మధ్య జరిగిన ప్రచ్చన్న యుద్ధంలో
ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి వర్గ శత్రు నిర్మూలనకు నక్సల్స్ జగిత్యాల జిల్లా బీర్పూర్ ఘాట్ రోడ్డులో మందు పాతర ప్రయోగం వికటించి 14 మంది అమాయకులు మృతి చెందిన సంఘటనకు నేటికీ 37 ఏళ్లు. మృతి చెందిన వారిలో  మావోయిస్టు సుప్రీం గణపతి, జనశక్తి నేత చలపతిరావు బంధువులు, అమాయకులు ఉన్నారు. నాటి హోం మంత్రి స్వర్గీయ మాధవ రెడ్డి  బీర్పూర్ సందర్శనకు నక్సల్స్  ప్రతీకారమా ? ప్రయోగమా ? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లు గా   ముద్రపడిన  నాటి పోలీస్ ఉన్నతాధికారులు  టార్గెట్ ? గా ఈ పథకం నక్సల్స్ ఎంచుకున్నారు అనే అంశంలో స్పష్టత లేదు. అయితే మందు పాతర పథకం అమలుకు మాస్టర్ మైండ్ గణపతిదే అనేది చర్చ. ఈ సంఘటన తో మొదటిసారి నక్సలైట్ ఉద్యమ చరిత్రలో అపకీర్తి మరకలు అంటుకున్నాయనేది వాస్తవం.

👉 హోం మంత్రి ప్రసంగం, పర్యటన, రెచ్చగొట్టిందా ?

నాటి తెలుగుదేశ ప్రభుత్వంలో హోం మంత్రి మాధవరెడ్డి 1989 ఆగస్టు లో సారంగాపూర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీర్పూర్ గ్రామంలో ఎలాంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పట్టా సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం లేకున్నా కనీసం గ్రామ సర్పంచ్ ఆహ్వానం లేకుండా బీర్పూర్ గ్రామాన్ని సందర్శించారు. హోం మంత్రి బీర్పూర్ లో ప్రజలను ఉద్దేశించి , మీ ఊరిలో హై స్కూల్ లేదు, పంచాయతీ బిల్డింగ్ లేదు,  రోడ్లు లేవు, ముందు ఊరు బాగు చేసుకోండి అంటూ పరోక్షంగా నక్సల్స్ నాయకులపై  విమర్శలు చేశారు.

👉  పోలీస్ అధికారులు టార్గెట్గా… ?

కరీంనగర్ జిల్లా పీపుల్స్ వార్ కార్యదర్శి పులి రాములు జగిత్యాల్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ కు, జగిత్యాల డి.ఎస్.పి వేణుగోపాల్ కృష్ణ సూత్రధారి అని,  అనేకమంది  నక్సల్స్ ఎన్కౌంటర్ లలో హత మారుస్తున్న  జగిత్యాల సిఐ నర్సింగరావు లను నక్సల్స్ హిట్ లిస్టులో చేరిపోయారు..

స్విచ్ బోర్డ్, తునా తునకలైన జీపు, రోడ్డుపై పడిన మృతదేహాలు (ఫైల్ ఫోటో)

దీనికి తోడు పీపుల్స్ వార్ గ్రూప్ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు @ గణపతి స్వగ్రామం బీర్పూర్ లో హోం మంత్రి పర్యటించారు, కనుక ఈ ప్రాంతంలో నక్సల్స్  కార్యకలాపాలు తగ్గినట్టు ఆనాటి అధికార పార్టీ విస్తృతంగా ప్రచారం చేయడం, నక్సల్స్ నాయకత్వాన్ని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతిని మరింత రెచ్చగొట్టింది అనేది చర్చ.

మోస్ట్ వాంటెడ్ పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు @ గణపతి స్వగ్రామం  బీర్పూర్ లోనే హోం మంత్రి పర్యటన అంశం గణపతిని రెచ్చగొట్టింది అని, అత్యంత శక్తివంతమైన 7 మందు పాతర లు  అమర్చి ఎంతో అనుభవం, ప్రావీణ్యం ఉన్న నక్సలైట్లతో పేల్చడానికి  ఆపరేషన్ చేపట్టిన.. ముందుగా ఒకటి విఫలం కాగానే మిగతావి పేల్చకుండా వదిలిపోయారు..

👉 మందు పాతర విస్పోటంలో ప్రాణాలతో బయటపడ్డది ఇద్దరే ఇద్దరు !

జీప్ డ్రైవర్ రాజం ( ఫైల్ ఫోటో )

నక్సల్స్  చేతిలో ముందు రాత్రి హతమైన వంగపల్లి తిరుపతిరావు, బంధువులు బీర్పూర్ గ్రామానికి వస్తున్న జీపు  మొదటి మందు పాతర  వద్దకు రాగానే పేల్చివేశారు. మృతుడు తిరుపతిరావు మనుమరాలు ( వంగపెల్లి చంద్రశేఖర రావు కూతురు)  6 సంవత్సరాల చిన్నారి అశ్విని ఎగిరి వాగు ఇసుక తిన్నెలపై పడి అపస్మారక స్థితికి చేరుకుంది.

చిన్నారి వంగపల్లి అశ్విని ( ఫైల్ ఫోటో)

జీపు డ్రైవర్ రాజం స్వల్ప గాయాలతో రోడ్డుపై పడిపోయాడు. (సంఘటన స్థలం నుంచి వీరిని హుటాహుటిన గ్రామస్తులు ఆసుపత్రికి తరలించడంతో బ్రతికారు)

👉 సంఘటనా స్థలంలో మరణించిన వారు..!

కాకులమర్రి విద్యాసాగర్ రావు, కాకులమర్రి వనజ, కాకులమర్రి సరిత, కాకులమర్రి శశిధర్, వంగపల్లి శ్రీ రంగారావు, వంగపెల్లి శాంతాదేవి, యాచమునేని వెంకట్రావు, యాచమనేని విజయ, మోతుకూరి నరసయ్య ( రేచిపెల్లి) సాగి వసంతకుమారి, వంగపల్లి సత్యం రావు, వంగపల్లి రేణుక, సాగి నీరజ, సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో  చంద్ర పుల్లారెడ్డి గ్రూపు నాయకుడు చలపతిరావు సొంత చెల్లెలు రేణుక, గణపతి దగ్గరి బంధువులు సైతం ఉన్నారు..

👉 మరో కథనంలో….. బీర్పూర్ మందు పాతర  టార్గెట్ ఎవరు ?