దివ్యాంగులు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత.!


👉 సమీక్ష సమావేశంలో మంత్రి అడ్లూరి…

J.SURENDER KUMAR,

దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వికలాంగుల మరియు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


హైదరాబాద్  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  సచివాలయం లో సోమవారం ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

👉 సంక్షేమ వసతి గృహాల్లో వారికి నాణ్యమైన ఆహారం, సురక్షితమైన మంచినీరు, మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

👉 ముఖ్యంగా దివ్యాంగ పిల్లలు, విద్యార్థుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, భద్రత, పోషకాహారం విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

👉 దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో, గౌరవప్రదమైన జీవితం గడిపేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్  అధికారులను ఆదేశించారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని మంత్రి సూచించారు.