ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ !

👉 నేపాల్‌లో నెలకొన్న వరదల నేపథ్యంలో…

👉 సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


నేపాల్‌లో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

నేపాల్‌లోని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తూ, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తోంది. నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులతో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబ సభ్యులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

సహాయం కోసం సంబంధిత వ్యక్తి పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, ప్రస్తుతం/చివరిగా తెలిసిన ప్రాంతం, టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను అందించాలి.

👉 హెల్ప్‌లైన్ నంబర్లు…

👉 📞 శ్రీమతి వందన: 9871999044

👉 📞 సీ. హెచ్. చక్రవర్తి: 9949351270

👉 📞 జి. రక్షిత్ నాయక్: 9618597969

హెల్ప్‌లైన్‌కు అందే విజ్ఞప్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందేలా తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేస్తుంది. పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.