J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్ర శ్రావణమాసం సందర్భంగా గురువారం నుండి స్వామివారాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నట్టు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు .
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ప్రధాన ఆలయముతో పాటు అనుబంధ ఆలయము అయిన శ్రీ ఉగ్రనరసింహస్వామి ఆలయములో తేది 13-08-2026 నుండి 11-09-2026 వరకు శ్రావణమాసోత్సవం వైభవముగా నిర్వహించనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు .
👉 శ్రావణమాసం సందర్భముగా ప్రతి సంవత్సరం వలె ప్రధాన ఆలయములో శ్రీస్వామి వారికి నెల రోజులు ప్రత్యేక అభిషేకంలు, ప్రత్యేక పూజలు ₹ 2516/-లు చెల్లించిన భక్తుల పేరున నెల రోజుల పాటు అభిషేకము, పూజలు, సంకల్పము నిర్వహించబడును .
👉 అనుబంధ ఆలయమైన శ్రీ ఉగ్రనర్సింహస్వామి వారి ఆలయములో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు మరియు ప్రత్యేక భోగములు జరుగును. ₹ 2000/-లు చెల్లించిన భక్తుల పేరున నెల రోజుల పాటు అభిషేకము, భోగములు, సంకల్పము నిర్వహించబడును .
👉 అనుబంధ ఆలయమైన శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయము (శివాలయం)లో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు మరియు ప్రత్యేక భోగములు జరుగును. ₹1000/-లు చెల్లించిన భక్తుల పేరున నెల రోజుల పాటు “అభిషేకము మరియు అన్నపూజ” నిర్వహించబడును .
అదేవిధంగా ప్రతి సంవత్సరము వలె స్థానిక ఆర్యవైశ్య సంఘం, ధర్మపురి వారిచే రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు శ్రీ ఉగ్రనర్సింహస్వామి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించనున్నారు.
శ్రావణ మాసం భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్స్, మంచి నీటి వసతి, ప్రసాదాల తయారీ, ఇతర అవసర ఏర్పాట్లు జరుగుచున్నవి మరియు గోదావరి నది వద్ద శానిటేషన్, లైటింగ్ ఏర్పాట్ల, వాహనాల నియంత్రణ గూర్చి మున్సిపల్ వారిని అలాగే బందోబస్తు గూర్చి ముందస్తుగా శాఖకు సమాచారం ఇచ్చినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
