J.SURENDER KUMAR,
సంత్ నిరంకర్ బాబా బోధనలు మానవత్వం, ప్రేమ, సేవాభావం, సోదరభావాన్ని పెంపొందించేలా సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఇవి సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ధర్మపురి చైర్ పర్సన్ నాగలక్ష్మి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంఘనపట్ల దినేష్ అన్నారు.
ధర్మపురి పట్టణంలోని సంత్ నిరంకర్ బాబా మండల్ ధర్మపురి శాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో, శ్రీ సద్గురు మాతాజీ సుబిక్ష దేవి వారి కృపతో నూతనంగా నిర్మించనున్న సంత్ నిరంకర్ మిషన్ వసతి గృహానికి మంగళవారం చైర్ పర్సన్ నాగలక్ష్మి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దినేష్ భూమి పూజ చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, కో ఆప్షన్స్ సభ్యులు, సంత్ నిరంకర్ బాబా మండల్ సభ్యులు, సివిల్ ఇంజనీర్ రాజేష్ , వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
