👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో, ఉద్యమానికి దిశానిర్దేశం చేయడంలో ఆచార్య జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమైనవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన జీవితమంతా తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అంకితం చేసిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమకారుడు అని జయశంకర్ సార్ ను కొనియాడారు.
👉 తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆ మహనీయుడి సేవలను స్మరిస్తూ నివాళులర్పించారు.
👉 తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని సీఎం అన్నారు.

👉 జయశంకర్ సారు ఆశయాలు, విలువలు, నిబద్ధత నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాసేవ లక్ష్యాల సాధనకు ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
