J. SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి హుండీ ఆదాయం ₹ 1,62,16,621/- ( కోటి అరువది రెండు లక్షల , పద ఆరు వేల ఆరు వందల ఇరువది ఒక్కటి ) వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు..

ఆలయ ప్రాంగణంలో బుధవారం 13 హుండీలు 80 రోజులకు చెందిన ఆదాయం లెక్కించగా నగదు ₹ 1,62,16,621/- లు సమకూరినట్టు, మిశ్రమ వెండి, బంగారము తిరిగి బ్యాగ్ లో వేసి సీల్ చేసి హుండీలో భద్రపరచామన్నారు..విదేశీ కరెన్సీ 133 నోట్స్ సమకూరినట్టు ఈవో ప్రకటనలో పేర్కొన్నారు..

హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకు రాజమౌళి , ఆలయ AEO గుండి హరిహరనాత్, సునీల్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు డా. జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, స్థానాచార్యులు కపీందర్, పరిశీలకులు అశోక్, శ్రీనివాస్, ధర్మేందర్, ఆలయ సిబ్బంది, ఏ.ఎస్.ఐ, మహిళా కానిస్టేబుల్, హెూంగార్డ్స్, బ్యాంక్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలో లెక్కింపు జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు.
