మైనారిటీ మహిళలకు సబ్సిడీ ఆర్థిక సహాయం!


👉 39 మంది మైనారిటీ మహిళలకు ₹ 19.50 లక్షల సబ్సిడీ చెక్కుల పంపిణీ   చేసిన మంత్రి అడ్లూరి !

J.SURENDER KUMAR,

మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కింద  100% సబ్సిడీ రుణాల ఆర్థిక సహాయం మా ప్రజా పాలన ప్రభుత్వం అందిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణ, మండల పరిధిలో ఎంపికైన 39 మంది మహిళలకు  ₹ 19.50 లక్షల విలువైన 100 శాతం సబ్సిడీ చెక్కులను  బుధవారం ధర్మపురి మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి  పంపిణీ చేశారు.

ఈ పథకం కింద ఒక్కో మహిళకు ₹ 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ పథకం ద్వారా వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, నిరుపేదలు, ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత అందనుంది. ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను ఏర్పరుచుకుని ఆర్థికంగా ఎదగాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  లబ్ధిదారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.