👉 ధర్మపురి చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి !
J SURENDER KUMAR,
వర్షపు నీటిని వృథా కాకుండా ఇంకుడు గుంతలు (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంపొందించాలని ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగ లక్ష్మి సూచించారు.
ధర్మపురి పట్టణం 9వ వార్డులో ఆదివారం మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన “క్యాచ్ ది రైన్” అవగాహన కార్యక్రమంలో చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పాల్గొని ప్రజలకు వర్షపు నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
👉 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

ప్రతి ఇంటి యజమాని తమ ఇంటి వద్ద వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, దీంతో నీటి కొరతను తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు నీటిని భద్రపరచవచ్చని తెలిపారు.
👉 “ఎక్కడ వర్షం పడితే అక్కడే – ఎప్పుడు పడితే అప్పుడే నీటిని ఒడిసిపట్టండి” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ జల సంరక్షణలో భాగస్వాములు కావాలని చైర్ పర్సన్ పిలుపునిచ్చారు.
👉 ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ , వార్డు కౌన్సిలర్ విరవేణి నాగలక్ష్మి , మేనేజర్ , సానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ ,అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
