భాగవత ప్రవచకులు నీలకంఠ శర్మకు సన్మానం !


J.SURENDER KUMAR,


ప్రముఖ భాగవత ప్రవచకులు సంస్కృత విద్వాంసుడు డాక్టర్ ఆచార్య కశోజ్జుల నీలకంఠ శర్మ ను ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ  ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శుక్రవారం స్వామివారి ప్రసాదం, శేష వస్త్రం చిత్రపటం బహుకరించి ఘనంగా సన్మానించారు.


నీలకంఠ శర్మ ఈ నెల 18 నుంచి  క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భాగవత ప్రవచనం చేస్తున్నారు.  శనివారం ప్రవచనం సమాప్తం కానున్నది. ఈ నేపథ్యంలో  ఆచార్య కశోజ్జుల నీలకంఠ శర్మ ను  దేవస్థానం పక్షాన ఘనంగా సన్మానించారు.


ఈ కార్యక్రమంలో వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ , సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి, శారద బ్రాహ్మణ మహిళా మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.