👉 చట్టం న్యాయం మీకు అండగా ఉంటాయి !
👉 వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్న సబ్‌జడ్జి సరిత మట్ట !
J SURENDER KUMAR,
ఆదరణకు నోచుకోని వృద్ధులకు చట్టం, న్యాయం ఎల్లవేళలా అండగా ఉంటాయంటూ సబ్‌జడ్జి సరిత మట్ట భరోసా కల్పించారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెంచేలా వృద్ధులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్‌లో ఉన్న శ్రీ గాయత్రి విశ్వకర్మ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని సబ్‌జడ్జి సరిత మట్ట శుక్రవారం సందర్శించారు.
👉 ఈ సందర్భంగా వృద్ధుల ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో వారికి ఎదురవుతున్న సమస్యలు, అవసరాలపై ఆరా తీసి.. ఏదైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

👉 చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు. తమ హక్కుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన సమయంలో న్యాయ సహాయం పొందవచ్చని వివరించారు.
👉 అనంతరం వృద్ధులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. న్యాయ చైతన్యంతో పాటు ఆప్యాయతను పంచిన సబ్‌జడ్జి సరిత మట్టను ఆశ్రమ నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ భాస్కర్, ఆశ్రమ అధ్యక్షుడు టి.వి. సూర్యం, కార్యదర్శి ముమ్మడి నాగభూషణం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
