👉 మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజాసమస్యలు పట్టించుకోలేదు!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలపై దమ్ముంటే కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకువస్తే అవినీతి అభివృద్ధిపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి అయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా ధర్మారం, పెగడపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు…
2014 – 2018 లో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టి దళితులను మోసం చేశారని మంత్రి ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.

👉 రాష్ట్రంలోని పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని రాష్ట్రంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని మంత్రి అన్నారు. కేసీఆర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు మాత్రం ఫాంహౌస్ లు నిర్మాణం చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.
👉 ధర్మపురి ఎమ్మెల్యే గా, ప్రభుత్వ విప్ గా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్, ధర్మపురి నియోజకవర్గ రైతుల సాగునీటి అవసరాలను ఏనాడు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. . ధర్మారం మండలం పత్తిపాకలో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి పేరున రిజర్వాయర్ నిర్మిస్తామని మాట తప్పారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఏనాడు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే ఆలోచన చేయలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బాకీ కార్డుల పేరుతో కేటీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మంత్రి మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు తోడు దొంగలని మంత్రి ఆరోపించారు

👉 రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పావుల వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం అందజేస్తున్నామని మంత్రి తెలిపారు.
👉 మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పరిష్కరించి ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
