👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు క్యాడర్ ర్యాలీలో నృత్యాలు !
J.SURENDER KUMAR,
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన వెయ్యి రోజుల పూర్తి అయినా సందర్భంలో విజయోత్సవ ర్యాలీలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ర్యాలీలో నృత్యాలు చేశారు.

రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ధర్మపురి పట్టణంలో ఆదివారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ధర్మపురిలోని మంత్రి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పటేల్ చౌరస్తా, గాంధీ చౌక్ , నంది చౌక్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు డీజే సౌండ్ లు కాంగ్రెస్ పార్టీ జెండాలు బెలూన్స్ పట్టుకొని భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

విజయోత్సవ ర్యాలీలో ధర్మపురి, బుగ్గారం గొల్లపల్లి వెలగటూర్ ఎండపెల్లి, పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలతో పాటు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, ధర్మపురి కాంగ్రెస్ అధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, సీనియర్ నాయకులు వేముల రాజేష్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ధర్మపురి పట్టణానికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు ఊరేగింపుగా వెళ్లి శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్ ఫంక్షన్ ఘనంగా స్వాగతించారు.
