సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలి !

👉 అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలి !

👉 మంత్రులు  తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు,
అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ !

J.SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 30వ తేదీన బుధవారం
పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

మంత్రులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పుష్పగుచ్ఛాలు అందజేసి.. స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇంచార్జి మంత్రి, వ్యవసాయ, చేనేత జౌళి శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు శ్రీధర్ బాబు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల. సముదాయంలో శనివారం సమావేశం నిర్వహించారు.

సీఎం రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు, అలాగే సిరిసిల్ల రగుడు బై పాస్ రోడ్ వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు ట్రాఫిక్, బందోబస్తు, భద్రతా చర్యలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.


👉 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…..


జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వామ్యులు కావాలని సూచించారు. ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకునేలా తమ సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి.. సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.