👉 పేదలు,దళిత,గిరిజన మైనారిటీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ !
J.SURENDER KUMAR,
భూస్వామ్య, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణలో మా ప్రభుత్వ ప్రజా పాలన కొనసాగిస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి శనివారం చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు.
👉 ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు అర్పించిన మంత్రి.. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.
👉 సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆశీస్సులతో, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని బలోపేతం చేస్తూ.. పేదలు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

👉 దొరల పెత్తనానికి, అణచివేతకు చరమగీతం పాడి ప్రజలే కేంద్రంగా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అడ్లూరి పిలుపునిచ్చారు.
