👉 తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం-2007 పుస్తకం మరియు బోర్డుల ఆవిష్కరణ !
👉 ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR ,
కోటిలింగాల పుణ్యక్షేత్రం వద్ద అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007, నిబంధనలు 2011, జి.వో 40కి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే, పోలీస్ స్టేషన్లలో ప్రదర్శించాల్సిన ఈ చట్టానికి సంబంధించిన బోర్డులను కూడా ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ , ఆర్.డి.ఓ మధుసూధన్ , సంక్షేమ అధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
👉 వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు:!
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీన వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వృద్ధులను గౌరవించడం, వారిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు గుర్తుచేశారు. ఈ చట్టాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
