పుష్కరాలకు ముందే పనులు పూర్తి మంత్రి అడ్లూరి !

👉 2027 ఫిబ్రవరి 29 లోపు కోటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు !


👉 పుష్కర ఘాట్లు కోటేశ్వర స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J. SURENDER KUMAR,

2027 లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ముందే ఫిబ్రవరి 29 లోపు పుష్కర  కోటేశ్వర స్వామి ఆలయ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గురువారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో పుష్కరాల పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.


👉 పుష్కర పనుల్లో భాగంగా ధర్మపురి నియోజకవర్గానికి ప్రభుత్వం ఇప్పటికే ₹ 117 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి పర్యటన సందర్భంగా సుమారు ₹ 80 కోట్ల నిధులు కేటాయించాలని కోరగా ₹ 81 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.


👉 కోటిలింగాల ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం  ₹ 10 కోట్లు కేటాయించిందని పుష్కర ఘాట్ల నిర్మాణానికి ₹ 16.13 కోట్లతో నిర్మాణం చేస్తున్నామని మంత్రి తెలిపారు. శంకుస్థాపన చేసిన ఈ పనులు 2027 ఫిబ్రవరి 29 లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.


👉 గోదావరి పుష్కరాలు నాటికి అన్ని పనులు పూర్తిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వం తల్లిదండ్రులు, వయోవృద్ధులు, దివ్యాంగుల వారోత్సవాల పోస్టర్ ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తో కలిసి ఆవిష్కరించారు.