J.SURENDER KUMAR,
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో విద్యుత్ షాక్ తో మరణించిన కొప్పుల రాజశేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం పరామర్శించి ఓదార్చారు .

కొత్తపేట గ్రామంలో రాజశేఖర్ మృతదేహానికి నివాళులు అర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
