👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన, చేసిన అవినీతి, అక్రమాల చిట్టాలు బయటపెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ లను ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ప్రజలు, మండల నిర్వాహకులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని మంత్రి అన్నారు. కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని మంత్రి ప్రశ్నించారు.

👉ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్మెంట్ భూముల బాగోతాన్ని బయటపెట్టి త్వరలో పేద దళితులకు పంపిణీ చేస్తున్న మంత్రి అన్నారు.
👉పది సంవత్సరాల కాలం అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. రానున్న రెండు సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో జరిగిన అవినీతిని ప్రజల ముందు ఉంచి బీఆర్ఎస్ నాయకులను నిజ స్వరూపం చూపిస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

కార్యక్రమంలో ధర్మారం మండల పార్టీ అధ్యక్షుడు రూప్ల నాయక్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి, అంజన్న, ఉదయ్, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
