వైద్య విద్యకు పేదరికం అడ్డంకి కాలేదు..!

👉 విద్యార్థినికి వైద్య విద్యకు దాతల చేయూత !

👉‘స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రామ్’ ద్వారా ₹ 1.25 లక్షల ఆర్థిక సాయం !


J.SURENDER KUMAR,

నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా దాతలు అండగా నిలిచారు. ‘స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రామ్’ ద్వారా ఆమెకు ₹1.25 లక్షల ఆర్థిక సాయం అందించారు.


👉 ధర్మపురికి చెందిన కు. ఉప్పుల శ్రీనిధి ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించింది. అయితే, ఆమె తండ్రి శ్రీనివాస్ స్వర్ణకార వృత్తిపై ఆధారపడి జీవిస్తుండటంతో, ఏడాదికి సుమారు ₹ 3 లక్షల ఫీజును చెల్లించడం కుటుంబానికి భారంగా మారింది.


👉 విద్యార్థిని చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ‘స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రామ్’ కన్వీనర్ డా. గొల్లపెల్లి గణేశ్,  దాతలు స్పందించి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన పలువురు దాతలు శ్రీనిధి వైద్య విద్య కోసం ₹ 1.25 లక్షలు సమకూర్చారు.


👉 సమకూరిన ఆర్థిక సహాయాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఇందారపు రామకృష్ణ చేతుల మీదుగా సోమవారం విద్యార్థినికి అందజేశారు. సకాలంలో స్పందించి పేద విద్యార్థిని వైద్య విద్యకు అండగా నిలిచిన దాతలందరికీ డా. గొల్లపెల్లి గణేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి శ్రీనివాస్, సామాజిక సేవకులు రంగు లక్ష్మీనరహరి తదితరులు పాల్గొన్నారు.