J.SURENDER KUMAR,
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ₹10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
👉 తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, వృథా చేయకూడదని అవగాహన కల్పిస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకున్నారు. ఉద్యమ సమయంలో వీరు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారు.

👉 హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి 2026 సెప్టెంబర్ 9న, ఆయన భార్య పుష్పలత 2026 సెప్టెంబర్ 10న విషాదకర సంఘటనలో మృతి చెందారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి CMRF నుంచి సీఎం ఓఎస్డీ గారు ₹ 10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు.
👉 మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు.
