ప్రేమ్ సాగర్ రావు పట్టుదలతోనే  మంచిర్యాల అభివృద్ధి !

👉 మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ !


J SURENDER KUMAR,


మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, భవిష్యత్తు ఆలోచనపరుడు, పట్టుదల నాయకుడు, ఆయన కృషితోనే  మంచిర్యాల ఎంతో అభివృద్ధి చెందుతోందని  మంత్రులు శ్రీధర్ బాబు లక్ష్మణ్ కుమార్  అన్నారు.

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో  సోమవారం  వైభవంగా జరిగింది. ఈ పుట్టిన రోజు వేడుకలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి   అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు.

శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాల లోని పద్య నాయక కళ్యాణ మండపం వరకు మంత్రులను కాంగ్రెస్ క్యాడర్ ఓపెన్ టాప్ జీపులో ఘనంగా స్వాగతించారు.

👉 ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…..

కొంతకాలం ఓపికగా ఉండండి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుకున్న పద వీ వస్తుందని కార్యకర్తలనుద్దేశించి కామెంట్ చేశారు. ఆయన పట్టుదల వల్లే మంచిర్యాల నియోజకవర్గం దినాదినాభివృద్ది చెందుతోందని అన్నారు. ప్రజా నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అని మంత్రులు కొనియాడారు. గజమాలవేసి కేక్  ఎమ్మెల్యేకు మంత్రులు తినిపించారు.

👉 ఎంపీగా వంశిని గెలిపించి మానసిక క్షోభ అనుభవిస్తున్నాను ప్రేమ్ సాగర్ రావు !

👉 ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…..


కలిసికట్టుగా తాము గడ్డం వంశీకృష్ణను ఎంపీని చేసి తాను క్షోభను అనుభవిస్తున్నానని అన్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఇవ్వకపోతే ఎంపీగా గెలిచే వాడివా ? అని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

హైకమాండ్ మాట జవదాటని, క్రమశిక్షణ కలిగిన, నేతలం కాబట్టి వంశీని గెలిపించి తాముతా ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తున్నామన్నారు. ప్రోటోకాల్  పాటించకుండా
ఎమ్మెల్యే నియోజకవర్గానికి వెళ్లినా స్థానిక ఎమ్మెల్యేలకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని  ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులమధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్రావు అన్నారు.  జన్మదినం సందర్భంగా మంచిర్యాల బాయ్స్ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి సెంట్రలైజ్డ్ కిచెన్ద్వారా అందిస్తున్న టిఫిన్ తిన్నారు.