👉 భూమి పూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి లక్ష్మణ్ కుమార్ !
👉 సోమవారం తెల్లవారు జామున 2గంటల 48 నిమిషాలకు. ₹ 10 కోట్లు నిధులతో పనులు !
👉 ₹ 93 కోట్ల నిధులు పుష్కర పనులకు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ యోగ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం తెల్లవారుజామున భూమి పూజ చేశారు. దీంతోపాటు 2027 జూన్లో ప్రారంభం కానున్న గోదావరి నది పుష్కరల కు మరో ₹ 93 కోట్ల నిధుల పనులకు సైతం వీరు భూమి పూజ చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం రాత్రి ధర్మపురి క్షేత్రానికి చేరుకొని రాత్రి బస చేశారు. వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తం సోమవారం తెల్లవారు జామున 2గంటల 48 నిమిషాలకు. వేదమంత్రాల ఘోషలతొ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని శంకును ప్రతిష్టించారు.

👉 పలువురు భక్తులు అధికారులు టెంకాయలు కొట్టి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ దశలో పూజా కార్యక్రమానికి విచ్చేసిన టిఆర్ఎస్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డిని, సీనియర్ టిఆర్ఎస్ నాయకుడు, మాజీ చైర్ పర్సన్ తనయుడు సంగి శేఖర్ లను మంత్రి వారిని పూజా వేదిక వద్దకు పిలిచి టెంకాయలు కొట్టించారు.

👉 భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కోట్టిన టెంకాయ
👉 అనంతరం అనంతరం శ్రీ యోగ నారసింహ స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు అర్చకులు డిప్యూటీ సీఎం ఘనంగా ఆశీర్వదించి నరసింహుడి ప్రతిమను బహూకరించి స్వామివారి శేష వస్త్రం ప్రసాదాన్ని అందించారు.

దాత ఆలయానికి విరాళంగా ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని మంత్రులు టెంకాయ కొట్టి ప్రారంభించారు.
తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న మంత్రులను కమిషనర్ హనుమంతరావు, దేవాదాయ సహాయ కమిషనర్ సుప్రియ, ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, అర్చకులు వేద పండితులు మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతించారు. కార్యక్రమంలో రెవెన్యూ, దేవాదాయ, పోలీస్, కౌన్సిలర్లు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తజనం పాల్గొన్నారు.
👉 ₹ 93 కోట్లు అభివృద్ధి పనులకు భూమి పూజ !

👉.ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం పునరుద్ధరణ
₹ 10 కోట్లు…
👉 పుష్కర ఘాట్లు ₹ 22.16 కోట్లు ….
👉 పంచాయతీ రాజ్ రోడ్స్ ₹ 58.5 కోట్లు….
👉 తిమ్మాపూర్ సబ్ స్టేషన్ నిర్మాణం రెండో పాయింట్ ₹ 2.48 కోట్లు..
👉 భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖు లు

👉 డిప్యూటీ సీఎం .మల్లు భట్టి విక్రమార్క !
👉 మంత్రి.అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
👉. దేవాదాయ శాఖ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి హనుమంతరావు !
👉 NPDCL చైర్మన్, వరుణ్ రెడ్డి…
👉 జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్…
👉 ఎస్పీ అశోక్ కుమార్…
👉. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రాజ గౌడ్,
👉. ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి
👉 గ్రంధాలయ సంస్థ చైర్మన్, సంఘనపట్ల దినేష్.
👉 భారీ బందోబస్తు..


డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఆదివారం ధర్మపురి క్షేత్రం, ఆలయం పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. ప్రత్యేక పోలీసు బలగాలు, స్పెషల్ డాగ్స్, తో ఐదు బలగాలు మోహరించారు.. అగ్నిమాపక శకటం, అంబులెన్స్, స్థానిక ఆసుపత్రిలో అత్యవసర ఐక్య సిబ్బంది, అందుబాటులో ఉంచారు.
