అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మాజీ మంత్రి కొప్పుల!

👉🏻 నియోజకవర్గ అభివృద్ది కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ కృషి చేస్తున్నారు..!

👉 నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో..


J.SURENDER KUMAR,


గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరి వేస్తే ఉరే అని రైతులకు ఇబ్బందులకు గురి చేసిన మీరు ఈ రోజు రైతుల గూర్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అని, నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, ఆరోపించారు.

ధర్మపురి పట్టణంలో మంత్రి లక్ష్మణ్ కుమార్  క్యాంపు కార్యాలయంలో సోమవారం  నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


👉 సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ….

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందిని, ఎల్ఇనో ప్రభావంతో వర్షాలు పడక రైతులు నష్టపోవడం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ముందస్తుగానే రైతుల కొరకు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై మొగ్గు చూపే విధంగా అవగాహన కార్యక్రమాల ను ప్రభుత్వం చేపట్టడం జరుగుతుందనీ వారు అన్నారు.

👉గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేసిన చరిత్ర మీ ప్రభుత్వానిదని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టి బకాయిలు చెల్లించడం జరుగుతుంది.నియోజకవర్గ అభివృద్ది కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్  అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

👉బీఆర్ఎస్ హయంలో మూతపడిన లక్ష్మీ నరసింహా సంస్కృతాంధ్ర కళాశాలను పున:ప్రారంభించిన ఘనత మంత్రి లక్ష్మణ్ కుమార్ ది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన చెగ్యం ఆర్ & ఆర్ కాలనీలో మంత్రి  కృషితో భూ నిర్వాసితులకు ₹18 కోట్ల పరిహారాన్ని చెల్లించిందన్నారు, నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి మంత్రి చొరవతో స్వాధీన పంచుకున్నారని అన్నారు.

👉గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో నూతన మండలాలను ఏర్పాటు చేసిన, మౌలిక వసతులను కల్పించడంలో అప్పటి పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి బుగ్గారం మండలానికి తహసిల్దార్ కార్యాలయాన్ని మంజూరు చేయించారని అన్నారు. 

👉నియోజకవర్గంలో ₹ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. అదే విధంగా ధర్మపురికి డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేసిన ఘనత మంత్రికే చెందుతుందని, నియోజకవర్గంలో ఇప్పటివరకు ₹ 7.5 కోట్ల ఎల్. ఓ. సి లను అందజేయడం జరిగిందన్నారు.

👉పవిత్ర గోదావరి నదిలో మురుగునీరు కలవకుండా సినరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరు చేయడం జరిగిందనీ గుర్తుకు చేశారు. రాబోయే పుష్కరాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత వైభవంగా కనీవిని ఎరగని రీతిలో నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, పెగడపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారి తిరుపతి, గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగన్న, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేశ్, ధర్మపురి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ మరియు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు