బాపూ ఘాట్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాళి !


J.SURENDER KUMAR,


జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి  పాల్గొన్నారు.

అలాగే, ప్రభుత్వ సలహాదారులు వీ హనుమంత రావు, హర్కర వేణుగోపాల్ , ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్ , రామచంద్ర నాయక్ , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , డీజీపీ సీవీ ఆనంద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.